ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2026 జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెట్ పరీక్షకు మొత్తం 2,37,754 దరఖాస్తులు రాగా, అందులో పేపర్ 1కు 85,538, పేపర్ 2కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఈసారి టెట్‌కు 1,66,084 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ 1కు 58,149 మంది, పేపర్ 2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్ష షెడ్యూల్
2026 జనవరి 3 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -1)
2026 జనవరి 3 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -2)
2026 జనవరి 4- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -1)
2026 జనవరి 4- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)
2026 జనవరి 5 పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2026 జనవరి 5- పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -2)
2026 జనవరి 6- పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2026 జనవరి 6- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -2)
2026 జనవరి 8 పేపర్ 1 (సెషన్ -1)
2026 జనవరి 8 పేపర్ 1 (సెషన్ 1)
2026 జనవరి 9 పేపర్ 1 (సెషన్ -1)
2026 జనవరి 11 పేపర్ 1 (సెషన్ -1)
2026 జనవరి 11 పేపర్ 1 (సెషన్ 2)
2026 జనవరి 19 పేపర్ 1(మైనర్) (సెషన్ -1)
2026 జనవరి 20 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్(సెషన్ -1)