మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరోసారి స్టార్ పవర్‌తో అదరగొట్టారు. ఆయన అప్ కమింగ్ ’పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఒక్క తెలుగు వర్షన్ లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటగా, ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ పాట ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలోని పవర్ ఫుల్ బీట్స్, ఆకట్టుకునే రిథమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రామ్‌చరణ్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో అందరినీ అలరిస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించిన స్టైలిష్ విజువల్స్, ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే గ్రాండియర్ ఈ పాటకు మరింత ప్లస్ అయ్యాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.