న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్య 20 ఏళ్లనాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే, కొత్తబిల్లును మోడీ ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 125 రో జుల పాటు గ్రామీణ ఉద్యోగాలకు హామీ ఇ చ్చే ఈ పథకాన్ని వ్యవసాయ శాఖమంత్రి శి వరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు. 20ఏ ళ్ల నాటి గ్రామీణ ఉపాధి పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా యి. మహాత్మాగాంధీ ఫోటోను ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవికా మిషన్ (గ్రామీణ్) విబి- జి రామ్ జి) బిల్లు 2025 గా వ్యవహరిస్తున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీని ప్రవేశపెడుతూ ప్రభుత్వం మహాత్మా గాంధీని నమ్మడమే కాకుండా ఆయన సూత్రాలను కూడా అనుసరిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.;
గత ప్రభుత్వాలకన్నా మోదీ సర్కార్ గ్రామీణాభివృద్ధికి చాలా చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలోనే ప్రతి పక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై విసృ్తతంగా చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ కు చెందిన ప్రియాంక గాంధీ తోపాటు పలువురు ఎంపీలు పథకం పేరులో మహాత్మాగాంధీ పేరు తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు ప్రవేశ పెట్టే దశలోనే దానిని వ్యతిరేకిస్తూ డిఎంకె కు చెందిన టిఆర్ బాలు మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణులకోసం, పేదప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాలలో అత్యంత పేదలకు ఖచ్చితంగా 100 రోజుల ఉపాధి కల్పించే అపూర్వమైన బిల్లును (ఎంఎన్‌ఆర్ ఇజిఏ) తీసుకువచ్చారని, అది పేదలకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మహాత్మా గాంధీ త్యాగాలను, జాతిపిత ను ఎగతాళి చేస్తోందని దుయ్యబట్టారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ముసాయిదా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంఎన్ ఆర్ ఇజిఏ ఓ విప్లవాత్మక చట్టం అని, దీనిని ఆమోదించినప్పుడు సభలోని సభ్యులంతా ముక్తకంఠంతో సమర్థించారని గుర్తు చేశారు. ఆ పథకం కింద కేంద్రం 90 శాతం నిధులు అందేలా చూసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కేంద్ర సహాయాన్ని 60 శాతంకు తగ్గిస్తుందని, అలాగే పేదల ఉపాధి హక్కులను బలహీనపరుస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె అన్నారు. కొంత మంది ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, మహాత్మా గాంధీ తమ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదని, దేశంలో ప్రతి కుటుంబానికి చెందిన వారని ప్రియాంక స్పష్టం చేశారు. గొప్ప పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు కీలకమైన గొప్ప కార్యక్రమం స్ఫూర్తి, తాత్విక పునాదిపై దాడిగా అభివర్ణించారు. విబి- జి- రామ్ – జి బిల్లును దుయ్యబడుతూ 1971 లో బాలివుడ్ చిత్రంలో ని పాట – దేఖో ఓ దీవానో (తుమ్) యే కామ్ న కరో, రామ్ కా నామ్ బద్నామ్ న కరో- అన్న పాటను గుర్తు చేశారు. విబి- జి రామ్- జి చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి ఆరు నెలలలోపు రాష్ట్రాలు కొత్త చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఓ పథకాన్ని రూపొందించాలి. ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.