కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. స్టేడియంలో గందరగోళం నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు బిశ్వాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపించినట్లు పేర్కొన్నారు.