దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ అభిజ్ఞాన్ కుందు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయిన అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ సాధించాడు. మలేషియా బౌలర్లను వీరబాదుడు బాది 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. యూత్ వన్డేల్లో టీం ఇండియాకు ఇదే మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. టీం ఇండియా బ్యాటింగ్‌లో అభిజ్ఞాన్ 209(నాటౌట్), వేదాంత్ త్రివేది 90, వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేశారు. మలేషియా బౌలింగ్‌లో ముహమ్మద్ అక్రమ్ 5, కృష్ణమూర్తి, సత్నకుమారన్ తలో వికెట్ తీశారు. భారీ లక్ష్య చేధనలో మలేషియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్లు ముగిసేసరికి మలేషియా 3 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజ్‌లో పాత్రో(0), ఆలిఫ్(0) ఉన్నారు.