లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీకా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య. అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. “బలగం చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత జరిగే పిండ ప్రధానం చుట్టూ సినిమా తిరుగుతుంది.
‘దండోరా’ చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత నుంచి పూడ్చి పెట్టే వరకు జరుగుతుంది. అంత్యక్రియలతో ఈ చిత్రం పూర్తవుతుంది. ‘దండోరా’లో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని పాత్రలు శివాజీ క్యారెక్టర్‌కు లింక్ అయి ఉంటాయి. బిందు మాధవి పాత్ర అయితే చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ‘దండోరా’ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఓ అందమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు”అని అన్నారు.