ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు మూడు వారాల విశ్రాంతి లభించనున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు చెందినక్రికెటర్లు దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సీనియర్లు సయితం ఈ టోర్నీలో ఆడక తప్పదని స్పష్టం చేసింది.
డొమెస్టిక్ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ప్రతి ఆటగాడు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బిసిసిఐ తేల్చి చెప్పింది. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని పేర్కొంది.