ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా హింసాకాండలో పాల్పడి, 15 మందిని దారుణగా హతమార్చిన దుండగులు ఓ తండ్రీ కొడుకులని సోమవారం పోలీసులు తెలిపారు. కఠినమైన తుపాకి నియంత్రణ చట్టాలు ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు మూడు దశాబ్దాలలో ఇటువంటి ఘోరమైన కాల్పుల ఘటన జరగడం ఇదే ప్రథమం.కాల్పులు జరిపిన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ అనే దుండగుడిని పోలీసులు కాల్చిచంపగా, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. సాజిద్ పండ్ల వ్యాపారి .ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ పాకిస్తానీ సంతతికి చెందిన వారని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నట్లు సిబిఎస్ న్యూస్ పేర్కొంది. సాజిద్ అక్రమ్ కు న్యూ సౌత్ వేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే ఆకుపచ్చ జెర్సీని ధరించినట్లు కన్పించింది.కొడుకు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడు.
తండ్రి సాజిద్ 1899లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లోపార్ట్ నర్ వీసా, తర్వాత రెసిడెంట్ రిటర్న్ వీసాలుగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం మంత్రి టోనీ బర్క్ తెలిపారు. యూదుల పండుగ హనుక్కా మొదటి రోజునే వారిని లక్ష్యంగా ఎంచుకుని దాడి చేశారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నిందించారు.నవీద్ కు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉందని బారత ఇంటెలిజెన్స్ అధికారిని ఉటంకిస్తూ, వార్తా సంస్త పేర్కొంది.ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అతడిని తనిఖీ చేసింది. ఓ కన్నువేసి ఉంచింది. పోలీసులు తనను గుర్తించకుండా కిందపడి నాటకాలు ఆడాడు. సాజిద్ పండ్ల దుకాణం నడిపేవాడు. అతడికి 10 క్రితం నుంచి తుపాకీ లైసెన్స్ ఉంది. కాగా కొడుకు నవీద్ ఇటుక పని చేసేవాడు. కంపెనీ దివాలా తీయడంతో రెండు నెలలక్రితం ఉద్యోగం పోయింది.
బీచ్ లో యూదులపండుగ
యూదుల 8 రోజుల హనుక్కా పండుగ ప్రారంభం నాడు చానుకా బై ది సీ కార్యక్రమానికి వేలాదిమంది తరలి వచ్చారు. బీచ్ లోని చిన్న పార్క్ లో హనుక్కా కార్యక్రమంలో దాదాపు 1,000 మంది హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పండుగ మొదలైన తర్వాత 10 నిముషాల పాటు దుండగులు కాల్పులు జరపడంతో చాలా మంది కిందపడిపోగా, కొందరు పరుగులు పెట్టారు. బీచ్ కు వెళ్లే పుట్ బ్రిడ్జి పై నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు పొడవైన తుపాకులతో కాల్పులకు తెగపడినట్లు ప్రత్యేక పుటేజిలో కన్పించింది. స్థానిక సమయం 6.45 గంటల ప్రాంతంలో కాల్పులకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. మృతులలో 10 ఏళ్ల పిల్లవాడి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసుకమిషనర్ మాల్ లోన్యాన్ విలేకరులకు తెలిపారు. గాయపడిన 42 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.