కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ, షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సోమవారం సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో థియేట్రికల్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.