హైదరాబాద్: అప్పుడు నెల్లూరు వాడిని.. ఇప్పుడు తెలంగాణ వాడినని.. ఇక్కడ ఉంటున్నా కాబట్టి తెలంగాణ వాడినని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరి మనసస్సుల్లో బాలసుబ్రహ్మణ్యం చిరస్థాయిగా ఉండిపోతారని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. రవీంద్రభారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 7 అడుగుల కాంస్య విగ్రహాన్నివెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. భావితరాల కోసమే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరించామని, స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శమని కొనియాడారు. బాలు మన మధ్య లేకపోయినా.. పాట రూపంలో మనతోనే ఉన్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.