వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీస్ ఫీజును జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపు అమలు లోకి రానుంది. నిర్వహణ పరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలని వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికేషన్ ఫీజుకు వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే ఫీజు అదనమని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించే ముందు దరఖాస్తుదారులు ఫీజు వివరాలను సరిచూసుకోసూచించింది. సదరు వీసా అప్లికేషన్ సెంటర్ వెబ్‌సైట్ లేదా వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లను ప్రదర్శించాలని తెలిపింది. భారత్ సహా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.