న్యూఢిల్లీ : బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ సోమవారం నియామకమయ్యారు. దర్భాంగా నియోజకవర్గ ఎంఎల్‌ఎ అయిన సరౌగీ బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీని నియమించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీహార్ బీజేపీ అధ్యక్షునిగా దిలీప్ జైస్వాల్ ఉంటున్నారు.