మన దేశ పౌరులపై సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాన్ని సోదాహరణంగా తెలుపు తూ ‘ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్‌బుక్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం 2019లో వచ్చింది. ఇం గ్లీషుతో పాటు ‘ఫేస్ బుక్ కా అసలీ చెహరా’ అని హిందీలో కూడా విడుదల చేశారు. రాబోయే రోజుల్లో సామాజిక మాధ్యమాల చేతుల లో మన దేశం పరాధీనురాలు, పౌరులు కీలు బొమ్మలు అని ఆరేళ్ల క్రితమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తక రచయిత పరంజయ్ గుహ థాకర్తా, సహ రచయిత సిరిల్ శామ్. పరంజయ్ ఓ సీనియర్ జర్నలిస్టు. తన 35ఏళ్ల జర్నలిస్టు జీవితంలో దేశంలోని అన్ని ప్రధాన ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు.
ఫేస్‌బుక్, వాట్సాప్‌ల వాడకం వల్ల సమాచారం వెంటనే అందే మాట నిజమే కానీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను అది తప్పుడు, ద్వేషపూరిత సమాచార కర్మాగా రంలా మార్చివేస్తుందని ఈ పుస్తకం పేర్కొ నింది. కాలజ్ఞానంలా ఇందులో చెప్పినట్లే – ఎంతో చైతన్యవంతంగా కదిలే మనుషు లను కూచున్న చోటే గంటల తరబడి కట్టి వేసి ఏదో సాధిస్తున్నామనే భ్రమల్లో ఫేస్ బుక్ పడేసింది. కామెంట్లతో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు అనుకునే రోజులు వచ్చేశా యి. భావజాల తర్కానికి బదులు ద్వేషిం చుకొని, నోటికొచ్చిన బూతులు తిట్టుకునే స్థాయికి ఫేస్ బుక్ తెచ్చింది.
ఇలాంటి సామాజిక మాధ్యమాలు బూ టకపు, వివక్షాపూరిత, రెచ్చగొట్టే వార్తల ను ప్రచారం చేస్తూ, దేశ పౌరుల ఆలోచన సరళిని మార్చివేస్తున్నాయని, పాలకుల పంచన చేరి వ్యాపార విస్తరణ దిశగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని, ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించా రు. దేశంలోని బొగ్గుగని కార్మికులపై ‘కోల్ కర్స్’ అనే డాక్యుమెంటరీ పరంజ య్ నిర్మించారు. దేశంలోని పెట్రోలియం ఉత్ప త్తుల ధరల్లోని అక్రమాలు ఎత్తిచూపుతూ ‘గ్యాస్ వార్స్’ అనే పుస్తకం రాశారు. 2008లో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తొలి వ్యాసం రాసింది ఇతనే. ఇలా సుదీర్ఘ, సాహసో పేత పాత్రి కేయ చరిత్ర గల పరంజయ్ కలం నుండి దేశంలో ఫేస్ బుక్ లీలల గురించి వెలువడిన ఈ పుస్త కం సంచలనం సృష్టించింది. లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయి పాఠకుల మన్ననలు పొందుతోంది.
దేశంలోని వివిధ సంస్థల్లో ఫేస్‌బుక్ పెట్టిన పెట్టుబడుల వివరాలు, జియోకు కోరినంత ఆర్థిక బలాన్ని ఇ చ్చిన ఫేస్‌బుక్ ఉదారతపై అధ్యా యాలుగా ఈ పుస్తకంలో వివరించా రు. తొలి అధ్యాయాల్లో మన దేశం లో ఫేస్‌బుక్ ప్రజలకు ఎలా దగ్గరైం ది, క్రమంగా దేశ పాలకుల అవసరా లు తీర్చుతూ ఎలా ముందుకొచ్చింది అనే వివరాలు ఉన్నాయి. తనకు న చ్చని మీడియా సంస్థలను, జర్నలిస్టు లను, పాలకపక్షాన్ని విమర్శించేవారిని సెన్సార్ పేరిట ఫేస్ బుక్ పక్కన పెట్టిన తీరు వివరిం చారు. ఫేస్‌బుక్‌పై ప్రముఖ పత్రికలు వ్యక్తపరచిన అభి ప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు కట్టడి చేసేలా ఫేస్‌బుక్ నియమాలను మార్చు కుందని కారవాన్ పత్రిక పేర్కొంది. ఫేస్‌బుక్‌కు దే శ శాసనాలపై, చట్టాలపై గౌరవం లేదని, అది లైసెన్స్ లేని తుపాకీ అని ‘ది గార్డియన్’ రాసింది.
మయన్మార్‌లో రోహ్యింగాల పట్ల ద్వేషం పెంచి వేలాది మంది మరణాలకు, వలసలకు ఫేస్‌బు క్ కారణమైందని ఐక్యరాజ్య సమితికి అందిన ఓ రిపోర్ట్‌లో ఉంది. హిందూస్తాన్ టైమ్స్ జర్నలిస్టు చార్లెస్ అస్సేసీ ‘నేనెందుకు ఎఫ్‌బిని హేట్ చేస్తాను’ అనే వ్యాసంలో ‘ముందు అది మను షుల్ని మూగవారిని చేస్తుందని, ఆ తర్వాత వారి జీవితాల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది’ అని రాశారు. అందుకే అనవసరంగా వేలు ఆడించకూడదు. ప్రతి స్పందన ఫేస్‌బుక్‌కు కొంత ఆదాయాన్ని, కొత్త సమాచారాన్ని అంది స్తుంది అని ఈ పుస్తకం ముందు జాగ్రత్తలు బోధిస్తోంది.
– బద్రి నర్సన్