సాహితీ జగత్తులో ప్రతిధ్వనించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్, ఈ ఏడాది హంగేరియన్ -బ్రిటీష్ రచయిత డేవిడ్ స్జాలై రాసిన ‘ఫ్లెష్’ నవలకు దక్కింది. ఈ విజయం ఆధునిక కల్పనా సాహిత్య తాత్విక అన్వేషణ సరిహద్దులను మరింత విస్తృతం చేసింది. నిశితమైన జీవిత పరిశీలన, సున్నితమైన భావోద్వేగ చిత్రణలతో ఆధునిక సాహితీప్రియులను ఆకట్టుకుంటున్న స్జాలైకి ఈ పురస్కారం లభించడం, ఆయన రచనా ప్రయాణం లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఈ బహుమతి గెలుచుకున్న తొలి హంగేరియన్-, బ్రిటీష్ రచయితగా ఆయన చరిత్ర లో నిలిచారు.
డేవిడ్ స్జాలై సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న రచయిత. 1974లో కెనడా లో జన్మించినప్పటికీ, లండన్‌లో పెరిగి, ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్నారు. వివిధ సంస్కృతుల మధ్య పెరిగిన అనుభవం, వలస జీవితంపై ఆయనకు లోతైన అవగాహన కల్పించింది. ఆ అనుభ వం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2016లో ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవలకు సైతం బుకర్ ప్రైయిజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన స్జాలై, ఆరు నవలలు, పలు రేడియో నాటకాలు రచించారు. డేవిడ్ స్జలే-అస్తిత్వపు అన్వేషకుడు : ప్రపంచ సాహిత్య వేదికపై నిర్లిప్తత, వాస్తవికత అనే రెండు ధ్రువాల మధ్య నిలబడి ఆధునిక మానవుని అంతరంగ మథనాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన ఈ నవల కేవలం ఒక కథా సంపుటి మాత్రమే కా దు. ఇది సమకాలీన ప్రపంచంలో అస్తిత్వ శూన్యత ను, వలసల వల్ల కలిగే మానసిక విచ్ఛేదనాన్ని, పురుషత్వ నిగూఢ అర్థాలను లోతుగా విశ్లేషించే ఒక సాహిత్య దర్పణం. స్జాలై రచన అనంతమైన శూన్యంలో ఉనికి కోసం పోరాడుతున్న ప్రతి జీవి నిశ్శబ్ద రోదనను ప్రతిబింబిస్తుంది.
కథన శిల్పం-వచన వైవిధ్యం: స్జాలై రచనా శైలి అసాధారణమైన పొదుపుదనంతో కూడుకున్నది, దీనిని విమర్శకులు ‘శైలీపరంగా అస్థిపంజరం వంటిది’గా అభివర్ణించారు. ఈ పొ దుపుదనం కేవలం శైలిపరమైన ఎంపిక మాత్రమే కాదు, ఇది ఒక తాత్విక వైఖరి. ఆయన గద్యం, అలంకారాలు, విస్తృత వర్ణనల బరువు లేకుండా కేవలం మౌలికమైన సత్యాన్ని మాత్రమే ఆవిష్కరి స్తుంది. ఇది ఒక స్పటికపు అద్దం వలే మౌలికమైన మానవ సత్యాన్ని యథాతథంగా పట్టి చూపిస్తుంది. ఈ సాంద్రమైన భాషా సంవిధానం పాఠకుడికి మ రింత లోతైన భావనా ప్రపంచంలోకి ప్రవేశించే అ వకాశాన్ని కల్పిస్తుంది. దీనికి కారణం ఏమంటే కథలోని కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా ఇస్త్వాన్ జీవితంలోని చీకటి కోణాలైన జైలు జీవి తం, యుద్ధ సేవలను రచయిత వివరంగా చెప్ప కుండా ఉద్దేశపూర్వకంగా మౌనాన్ని పాటించడం ద్వారా ఆ ఖాళీలను పూరించాల్సిన భావనాత్మక భారాన్ని పాఠకుడికే బదిలీ చేస్తారు. తద్వారా ఆ హింస నిజమైన భారాన్ని పాఠకులు తమ అంత రంగంలో అనుభూతి చెందేలా ప్రేరేపిస్తుంది. ఈ కథన శిల్పం ద్వారా జీవితంలోని కొన్ని గాయాలు పైకి కనిపించకుండానే మనలో ఎంతగా లీనమైపో యి, మన అస్తిత్వాన్ని ఎలా శాసిస్తాయో రచయిత నిరూపించారు. నవలలోని ఈ నిర్లిప్త కథనం, ఇస్త్వాన్ పాత్ర భావోద్వేగ తిమ్మిరిని పాఠకులకు తెలియజేయడంలో అద్భుతంగా విజయం సాధిం చింది. ఇది స్జాలై ప్రయోగాత్మక కథన శిల్పానికి నిదర్శనం.
నవల అంతరార్థం: ‘ఫ్లెష్’: మానవ బలహీనతల సూక్ష్మచిత్రణ ‘ఫ్లెష్’ కేవలం ఇస్త్వాన్ వ్యక్తిగత కథ మాత్రమే కాదు. కథానాయకుడు ఇస్త్వాన్ జీవిత ప్రయాణం హంగేరీలోని పేదరికం నుండి లండన్‌లో ని సంపన్న వర్గాల సేవకునిగా మారడం, ఈ వ్యవస్థలో ఒక మనిషి కేవలం శారీరక శ్రమకు పరిమితమైన ఒక సాధనంగా ఎలా మారుతాడో విశ్లేషిస్తుంది. అంతే కాకుండా, లండన్‌లోని సంపన్నుల ఇళ్లలో పనిచేస్తూ, వారికి అదృశ్య సేవకుడిగా మారతాడు. ఇస్త్వాన్ తన దేశంలో గౌరవం లేని శ్రమను, విదేశంలో గుర్తింపు లేని శ్రమగా మార్చుకుంటాడు. ఇక్కడ ఇస్త్వాన్ శరీరం కేవలం శ్రమ యంత్రంగా పరిగణించబడుతుంది. అతని వ్యక్తిత్వం, ఆకాంక్షలు పూర్తిగా విస్మరించబడతాయి. ఈ నవల, ఆధునిక కాపిటలిజంలో మాన వ దేహం ఎలా ఒక వ్యాపార వస్తువుగా మారుతుందో లోతుగా తెలియజేస్తుంది.
ఇస్త్వాన్ పాత్రలో స్జాలై ఒక అస్తిత్వ వాద సంక్షోభాన్ని ఆవిష్కరించారు. అతను ఏ సమాజా నికీ పూర్తిగా చెందడు. హంగేరీలో లేడు, లండన్‌లో విలీనం కాలేదు. ఈ మధ్యస్థ స్థితి అతనిలో ఒక శాశ్వతమైన ఏకాంతాన్ని సృష్టిస్తుంది. నవలలోని ఏకాంత దృశ్యాలు ఇస్త్వాన్ ఒంటరిగా తిరుగుతూ, తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును విశ్లేషిం చుకోవడం పాఠకులను కూడా తమ వ్యక్తిగత శూన్యంలోకి ప్రయాణించేలా చేస్తాయి. స్జాలై పురుషత్వం అనే భావనను ప్రశ్నిస్తూ, అది పురుషుడికి బలం ఇవ్వడానికి బదులుగా ఎలా ఒక భారంగా మారుతుందో చూపించారు.ఇస్త్వాన్ హింసాత్మక చర్యలు, భావోద్వేగాలను అణచివేయ డం అనేవి సమాజం అతనికి నేర్పిన విషపూరిత పౌరుషానికి ప్రతిబింబాలు. తన బలహీనతను దా చడానికి అతను శక్తిని ఉపయోగించాలనుకుంటా డు, కానీ అది మరింత బాధను మాత్రమే మిగు లుస్తుంది.
వర్తమాన సమాజానికి అద్దం : బుకర్ న్యాయ నిర్ణేతల బృందం ఈ నవలలోని మా నసిక వాస్తవికత, కథన శిల్పంలోని సాంద్రతను అసాధారణంగా ప్రశంసించారు. వారు ఈ నవల ను ‘గాయపడిన ప్రపంచ గ్రంథం’గా అభివర్ణించ డం ద్వారా దాని తాత్వికతను గుర్తించారు. ‘ఫ్లెష్’ మరచిపోయే రచన కాదు. ఇది పాఠకుడిలో లోతైన ప్రశ్నలను రేకెత్తించి, జీవించడంలో ఉన్న నిశ్శబ్ద బాధను, అరుదైన సౌందర్యాన్ని ఏకకాలంలో అను భూతి చెందేలా చేస్తుందని వారు ప్రకటించారు.
సాహిత్యం-సత్యానికి, సంక్లిష్టతకు వారధి: ‘ఫ్లెష్’ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా సాహి త్య కర్తవ్యం కేవలం సౌందర్యారాధన కాదని, నిర్భ యంగా సత్యాన్ని ఆవిష్కరించడం, నిశ్శబ్దంగా ఉన్న గొంతులకు స్థానం కల్పించడం అని డేవిడ్ స్జాలై మరోసారి నిరూపించారు. ఈ నవల సమకా లీన సాహిత్యంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది.
– విర్గో