హైదరాబాద్: ఇద్దరు గొడవ పడుతుండగా మధ్యలోకి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పారామౌంట్ కాలనీ గేట్ నంబర్‌లో అద్నాన్, బిలాల్ మధ్య గొడవ జరిగింది. సమాచారం తెలియడంతో అద్నాన్ సోదరుడు ఇర్ఫాన్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. బిలాల్ కత్తి తీసుకొని ఇర్ఫాన్‌ను పొడిచాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇర్ఫాన్ చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.