15 JAGAN 03
అరబ్ రాజు అబ్దుల్లాతో మోడీ భేటీ …
జోర్డాన్ పర్యటనలో తొలిరోజు కీలక చర్చలు
అమ్మాన్ : అరబ్ ప్రముఖ దేశం జోర్డాన్‌లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన సోమవారం ఆరంభమైంది. ఇక్కడి వచ్చిన రోజు రాత్రే ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో సమావేశం అయ్యారు . ముఖాముఖి తరువాత ప్రతినిధి బృందాలతో కలిసి రాజప్రాసదంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజు ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జోర్డాన్‌కు రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయనకు రాజు సాదర స్వాగతం పలికారు. ఇక్కడి ప్రఖ్యాత చారిత్రక హుస్సేనియా ప్యాలెస్‌లోకి తోడ్కోని వెళ్లారు. . ఇరువురు నేతల నడుమ అనేక ద్వైపాక్షిక , ప్రాంతీయ ప్రాధాన్యతల విషయాలు ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం రెండోరోజు సుదీర్ఘ స్థాయిలో రాజు తో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరుగుతాయి. చిరకాల మిత్రబంధం ఉన్న జోర్డాన్‌తో మరింత సఖ్యత దిశలో అమ్మాన్‌కు చేరుకున్న ప్రధానికి జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వాగతం పలికారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తొలుత జోర్డాన్‌కు చేరారు.
మంగళవారం జరిగే సమావేశంలో దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పలు కంపెనీల ఉన్నతాధికారులు , నిర్వాహకులు పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ జోర్డాన్ దేశాల దౌత్య సంబంధాల వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మంగళవారం జోర్డాన్‌లోని భారతీయ సంతతి వారితో ప్రత్యేకంగా ఇష్టాగోష్టికి దిగుతారు. చారిత్రక నగరం పెత్రాలో జరిగే ఈ సమావేశానికి కాబోయే రాజు కూడా వెళ్లుతారు.ఈ సుసంపన్న అరబ్ దేశంలో వైవిధ్యభరిత పలు భాషలు సంస్కృతులు మేళవించుకున్న 17500కు పైగా భారతీయ సంతతివారు చిరకాలంగా జీవిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా జవుళి, నిర్మాణ , ఉత్పత్తి రంగాలలో పనిచేస్తున్నారు. భారత్ జోర్డాన్ మధ్య పటిష్ట ఆర్ధిక సంబంధాలు సాగుతున్నాయి. పైగా జోర్డాన్ నుంచి అత్యధిక కోటాలో భారత్‌క పాస్పేట్, పొటాష్ వంటి ఎరువులు అందుతాయి. జోర్డాన్ భారత్‌కు మూడవ అతి పెద్ద వాణిజ్య సంబంధాల దేశంగా ఉంది. ఇరుదేశాల వ్యాపార వాణిజ్య విలువ 2.8 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జోర్డాన్ నుంచి ముందు ఇతియోపియా, తరువాత ఒమన్‌లకు బయలుదేరి వెళ్లుతారు.