హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో తిలక్ బ్యాటింగ్‌లో విరవిహారం చేస్తున్నాడు. తొలి టి20ల్లో 32 బంతుల్లో 26 పరుగులు, రెండో టి20ల్లో 34 బంతుల్లో 62 పరుగులు, మూడో టి20ల్లో 34 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాల్లో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తిలక్ వర్మ 68 సగటుతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 67.1 సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు. వరసగా ఎంఎస్ ధోని(47.71), జెపి డుమిని(45.55) సగటు, సంగక్కర్(44.93)తో ఉన్నారు.