హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల ఫలితాలు సిఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండి సగం పంచాయితీలను కూడా కాంగ్రెస్ గెలవలేదని విమర్శించారు. తాము బిఆర్ఎస్ వైపేనని పల్లె ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని తెలియజేశారు. మన హక్కుల కోసం మనం కొట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ గూండాయిజానికి బిఆర్ఎస్ శ్రేణులు భయపడొద్దు అని కెటిఆర్ సూచించారు. పదవులకు వన్నె తెచ్చేలా బిఆర్ఎస్ సర్పంచ్ లు పనిచేయాలని, పదవి, ప్రాణం శాశ్వతం కాదు.. పేరు, గౌరవమే శాశ్వతం అని కెటిఆర్ పేర్కొన్నారు.