భాగ్యనగరంలో మరో సైబర్ మోసం వెలుగుచూసింది. సికింద్రాబాద్‌కు చెందిన 32 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో మోసానికి బలై రూ.75 లక్షలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాట్సాప్ ద్వారా పరిచయం అయి లాభాల ఆశ చూపిన మోసగాళ్లు పన్నిన వలలో ఈ యువకుడు పడ్డాడు. 2021లో వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వాహ కుల మని చెప్పుకున్న కొందరు వ్యక్తులు బాధితుడిని సంప్రదించారు. క్రికెట్ బెట్టింగ్, తీన్ పత్తి, క్యాసినో గేమ్స్ ఆడి సులభంగా లాభాలు వస్తాయని యువకుడిని ఆన్‌లైన్‌లో నమ్మబలికారు. తొలిసారి పది వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు యువకుడు. దీంతో మొదట రూ.10 వేల పెట్టుబడి పై కొంత లాభం వచ్చినట్టు చూపడంతో నమ్మిన బాధితుడు తర్వాత దాదాపు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ మొత్తం పూర్తిగా నష్టపోయినట్టు పోలీసులు వెల్లడించారు. నాలుగేళ్లలో ఆ యువకుడు రూ.75 లక్షల రూపాయలను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తూ వచ్చాడు.
2022 మార్చిలో మళ్లీ మోసగాళ్లు సంప్రదించి మరో ప్లాట్‌ఫామ్‌లో ఆడాలని ఒప్పించారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో బాధితుడు బ్యాంక్ ఖాతాలు, యూపిఐ ఐడిలు, క్యూ ఆర్ కోడ్లు, క్యాష్ డిపాజిట్ మెషిన్ల ద్వారా వివిధ అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లకు మొత్తం రూ.75 లక్షలు బదిలీ చేశాడు. చివరకు ఆ మొత్తం కోల్పోయా డు. తాను మోసపోయినట్లు గుర్తించి యువకుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై మోసం, ఆన్‌లైన్ ఫ్రాడ్, అక్రమ బెట్టింగ్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో సెబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతునే ఉన్నారు. అత్యాశలో పడిన అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఉన్నదంతా ఊడ్చుకుంటున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ సైబర్ మోసగాళ్లు తమదైన పంథాలో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ఆకర్షణీయమైన రీతిలో తొలుత డబ్బు ఆశ చూపి ప్రజలను మభ్య పెట్టి సైబర్ నేరగాళ్లు ఆనక అందినంతా దండు కుంటున్నారు. ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సైబర్ మోసాల బారిన పడొద్దని సూచిస్తున్నారు. సైబర్ మోసాల బారిన పడిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా డబ్లూ.డబ్లూ.డబ్లూ.సైబర్ క్రైమ్స్.జివొవి.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.