ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 ఓవర్లకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్ క్రమ్ (61) ఒక్కడే రాణించాడు. డొనావన్ ఫెరీరా (20), ఆన్రిచ్ నోకియా (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్సింగ్, కుల్ దీస్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టగా శివమ్ దూబె,హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.