ప్రపంచంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. తన, పర బేధం లేకుండా ఎవ్వరినైనా కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుంది. అలాంటి బాధ్యతనే ఓ వైద్యురాలు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ నిర్వర్తించారు. విమానం గాల్లో ఉండగా ఆస్వస్థతకు గురైన ఓ ప్రయాణికురాలిని ఆమె సిపిఆర్ చేసి కాపాడారు. దీంతో కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అంజలిపై ప్రశంసలు కురిపించారు.
శనివారం మధ్యాహ్నం గోవా నుంచి ఢిల్లీకి ఓ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి వెంటనే స్పందించి.. పేషెంట్‌కి సిపిఆర్ చేసి బ్రతికించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే జెన్నీని ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు అంజలి, జెన్నీతో పాటు ఉన్నారు.
ఈ విషయంపై కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అంజలిని అభినందించారు. ఇది చాలా స్పూర్తిదాయకమని, అధికారంలో ఉన్నా లేకపోయినా.. అంజలి వంటి నేతను నిజమైన ప్రజా సేవకు ఉదాహరణ అని. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఎక్స వేదికగా కొనియాడారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ కూడా అంజలిని ప్రశంసిస్తూ పోస్టు పెట్టింది. నిజమైన ప్రజా సేవకు పదవి, హోదాతో సంబంధం లేదని పేర్కొంది. ఇక నెటజన్లు అంజలిపై ప్రశంసల జట్టు కురిపిస్తున్నారు.