హైదరాబాద్: వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 25.4 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వనపర్తి మండలం(22.7), కొత్తకోట(25.6), మదానపూర్(27.1), అత్మకూర్(24.3), అమర్‌చింత(30.8), సిసికుంట(21) శాతం పోలింగ్ నమోదైంది. ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.