మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, ౧౫౩ మంది ఇతరులు ఉన్నారు. రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.