హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్‌లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే రెండు విడత ఎన్నికలతో పోలీంగా భారీగా నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవంచ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు సౌమ్య, చంద్రకళ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి.