అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మనస్పర్థలు రావడంతో భార్యను చంపి అనంతరం మృతదేహంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సంతమాగులూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి(28) ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం తన భార్య ఉంటున్న మాచవరం గ్రామానికి వెళ్లాడు. అనంతరం భార్య తీసుకొని గ్రామ శివారులోకి వెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.