చెన్నై: ప్రపంచకప్ స్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో భారత్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచకప్ స్కాష్ టైటిల్ సాధించిన తొలి ఆసియా జట్టుగా నయా చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 30 తేడాతో హాంకాంగ్, చైనా టీమ్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి సింగిల్స్‌లో జోష్న చిన్నప్ప విజయం సాధించింది. ఇలీతో జరిగిన హోరాహోరీ సమరం లో చిన్నప్ప 73, 27, 75, 71తో జయకేతనం ఎగు ర వేసింది. తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ అభయ్ సింగ్ జయభేరి మోగించాడు. అలెక్స్ లౌతో జరిగిన పోరులో అభయ్ 71, 74, 74తో విజయం సాధించాడు. దీంతో భారత్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో 17 ఏళ్ల యువ సంచలనం అనహత్ సింగ్ జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అనహత్ 72, 72, 75తో టొమాతో హోను చిత్తు చేశాడు. దీంతో వరుసగా మూడు సింగిల్స్ మ్యాచ్‌లు గెలిచిన భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఇంతకుముందు ఏ ఆసియా జట్టు కూడా ప్రపంచకప్ స్కాష్‌లో టైటిల్ సాధించలేదు. భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్రను తిరగరాసింది.