దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శనివారం భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ని 49 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. భారత బౌలర్ల దూకుడికి కళ్లెం వేస్తూ.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు పాక్ బౌలర్లు. దీంతో భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో అరోన్ జార్జ్ (85) అర్థ శతకంతో రాణించగా.. కనిష్క్ 46, ఆయుష్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలింగ్‌లో సయ్యం, సుభాన్ చెరి మూడు, షఫిక్ 2, హుస్సేన్, రజా తలో వికెట్ తీశారు.