నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్‌లో టెన్షన్‌తో సర్పంచ్ అభ్యర్థి చనిపోయాడు. అనాసాగర్ గ్రామంలో దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు.