హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో కుబీర్ మండలం సిర్పల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం టెంట్ వేస్తుండగా ఇద్దరికి విద్యుత్ తగిలి ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నవీన్ (25)గా పోలీసులు గుర్తించారు.