హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. ధర్పల్లి(20.99), దిచ్‌పల్లి(13.52), ఇందల్వాయి(19.95), జక్రాన్‌పల్లి(23), మక్లూర్(22.31), ముగ్పాల్(19.43), నిజామాబాద్ రూరల్(26.49), సిరకొండ(23.24) మండల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఎనిమిది మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.