అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడివాడ నెహ్రూ చౌక్ లోని షాపింగ్ కాంప్లెక్స్ కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్ ఫోన్ దుకాణం లో వచ్చిన మంటలు క్రమంగా మిగతా షాపులోకి వ్యాపించాయి. ఇదే కాంప్లెక్స్ లో జూనియర్ కళాశాల, ఎస్ బిఐ శాఖలు ఉన్నాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.