హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మండలం కొమ్ముగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఆగ్రహంతో ఇంట్లోని సామగ్రిని స్థానికులు ధ్వంసం చేశారు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, మరిది కొట్టిచంపి ఆత్మ హత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు, స్థానికులు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భర్త, అత్తమామ, మరిది ఇంటి నుండి పరారయ్యారు.