సిడ్నీ: ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సిడ్నీలోని బాండీ బిచ్‌లో ముసుగు ధరించిన దుండగులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. బీచ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు ఒక్కసారిగా తుపాకులతో ఫైరింగ్ చేశారు. ఈ దుర్ఘటనలో పది మందికి పైగా పర్యాటకులు మృతి చెందారు. కాల్పులకు భయపడి పర్యాటకులు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ దుండగుడిని హతమార్చారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాల్పుల్లో గాయపడిన వారిని హెలికాఫ్టర్లు, 30 అంబులెన్సుల్లో ఆస్పత్రకి తరలించారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
I am simply horrified to have been sent footage of a shooting at a Hanukkah celebration at Bondi Beach in Sydney, Australia.
My thoughts and prayers are with the Jewish community in Australia at this awful moment. I sincerely hope that my friends are safe, and I am praying for… pic.twitter.com/gTx254iQ5z
— Sharren Haskel השכל שרן (@SharrenHaskel) December 14, 2025