దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు అంతస్థుల అహోబిలం ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆలయం కూలిన సమయంలో కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతి వ్యక్తి ఉన్నాడు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.