మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా అంతంతామాత్రంగా ఉంటుంది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఈ రాశి వారు కాలభైరవ రూపాయి మెడలో ధరించండి ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు మెరూన్.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం అంతంత మాత్రమే. దైవానుగ్రహం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కష్టమవుతుంది. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. సహోదరుల మధ్య ఏర్పడిన వివాదాల తొలగిపోతాయి. ఒక స్థిరాస్త్రి అమ్మి రుణాలు మొత్తం తీర్చి వేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. కెరియర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గో సేవ చేయండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.
మిధున రాశి
మిధున రాశి వారికి కూడా ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నచిన్న తగాదాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. డాక్టర్లకి లాయర్లకి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అవసరం. స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు ఈ వారం వసూలు అవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు మిల్కీ వైట్.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో సలుపు ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామా పారాయణం చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈవారం అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కొంతకాలం ఆగిన తర్వాత మొదలు పెట్టండి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. కన్స్ట్రక్షన్ రంగం అంతా అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఈ వారం మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. షేర్ మార్కెట్ కి స్పెక్యులేషన్ కి దూరంగా ఉండటం మంచిది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలలో రాణిస్తారు. ముఖ్యమైన విషయాలలో మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వారాంతంలో అవసరానికి ధనం చేతిలో ఉండక రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్.
తులారాశి
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నప్పటికీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డుల విషయంలో పర్సనల్ లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలు చాలా వరకు తీరుస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. కోర్టు సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే వ్యాపారం ఏదైనా సరే మీరు దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు బాగుంటుంది. ప్రస్తుతం వివాహానికి కాలం అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వేచి ఉండి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పాస్పోర్ట్ వీసా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయాలలో రాణిస్తారు. ప్రతి బుధవారం జిల్లేడు వత్తులతో
దీపారాధన చేయండి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో ఓర్పు సహనం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చిన్నచిన్న అడ్డంకులు కానీ లేదా కార్యాలయంలో పై స్థాయి ఉద్యోగులతో విభేదాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన ఆలస్యంగా పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నాలు కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది శని అంతా అనుకూలంగా లేడు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి శని గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. దైవదర్శనం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా
ఉంటుంది లాభాలు మీరు ఆశించిన రీతిలో ఉంటాయి. సినీ కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు ప్రయాణం చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. గో సేవ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
కుంభ రాశి
కుంభ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని రెండవ దశ నడుస్తున్నప్పటికీ శని భగవానుడి అనుగ్రహం వలన అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి విజయాన్ని అందుకోగలుగుతారు. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది వాహనయోగం ఉంది. శనికి డైలాగు షేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంపరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం గతం కంటే బాగుంటుంది. సోదర సోదరీమణుల మధ్య సఖ్యత బాగుండదు. ఖర్చులను అదుపులో ఉంచగలుగుతారు. వ్యాపార పరంగా రాబడి బాగున్నప్పుడే పొదుపు చేయండి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. రుణాలు తీర్చి వేస్తారు. గృహ నిర్మాణ పనులు పూర్తి అవుతాయి. నూతన కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లభిస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహాలు స్తోత్రాన్ని చదవండి. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి పంచ పలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.