బెంగళూరు: పెంపుడు చిలుకను కాపాడబోయి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గిరి నగర్ ప్రాంతంలోని వీరభద్ర నగర్‌లో లిఖిత అనే యువతి నివసిస్తోంది. ఆమె విదేశీ జాతికి చెందిన చిలుకను పెంచుకుంటుంది. చిలుక కిటికీలో నుంచి ఎగిరి విద్యుత్ తీగపై వాలింది. విద్యుత్ తీగ పైనుంచి ఇంట్లో రాకపోవడంతో తన బంధువు అరుణ్ కుమార్ ను లిఖితి తన ఇంటికి పిలిచింది. ఇనుప గొట్టానికి కట్టెను కట్టి చిలుకను బెదిరించసాగాడు. ఇనుప గొట్టం హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో ఘటనా స్థలంలో అరుణ్ చనిపోయాడు. పోలీసులు, విధ్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో హైటెన్షన్ వైర్లను తొలగించాలని పలుమార్లు స్థానికుల మొర పెట్టుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిలుక కోసం ప్రాణాలు తీసుకున్నావా? బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.