కోల్‌కతా: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అయితే కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. దీంతో ఫ్యాన్స్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మైదానంలోకి వెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రస్తుతం అభిమానులను అదుపు చేస్తున్నారు.