మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెద్ద శంకరంపేట జాతీయ రహదారిపై ఓ బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు, కుమారుడు, కూతురు చనిపోయారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలో ఓటు వేసేందుకు బైక్ పై సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.