డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు, ఇద్దరు వినియోగదారులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం మియాపూర్, ప్రేమ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 55 ఎల్‌ఎస్‌డి పేపర్స్, గ్రాము కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ, గంజాయి కేక్, 56 గ్రాముల హ్యాష్ ఆయిల్, 10 గ్రాముల మేజిక్ మష్రూమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.