నిర్మల్ జిల్లా కడెం మండలంలోనీ ఉడుంపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55)ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈనెల పదో తారీకు నాడు భీమయ్యను సమీప అడవి ప్రాంతంలోకి తీసుకొని వెళ్లి కర్రతో కోట్టి హత్య చేసి కాల్చేబూడిద చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం మంత్రాలు చేస్తున్నారని అనుమానంతో ఈనెల 10వ తేదీన ఊరి చివర అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కర్రలతో కొట్టి హత్య చేసిన అనంతరం కాల్చి బూడిద చేశారు. బంధువుల ఫిర్యాదులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఖానాపూర్ సిఐ అజయ్ బాబు, కడెం ఎస్ఐ సాయికిరణ్ తెలిపారు.