అమరావతి: అనకాపల్లి జిల్లా కశిం కోట మండలం కొత్తపల్లి వద్ద దారుణం చోటు చేసుకుంది. బీమా నగదు కోసం మామను (54) అల్లుడు, మనవడు హత్యచేశారు. మృతుడు సిమెంటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ హత్యకు సహకరించాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తికి రూ.1.08 కోట్ల ఇన్సూరెన్స్ ఉండడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రోడ్డు ప్రమాదంగా అల్లుడు అన్నవరం చిత్రీకరించాడు.. నిందితులు అల్లుడు అన్నవరం, మనవడు ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు.