ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటిక్రితమే అక్కడి నుంచి నేరుగా మెస్సి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుుకున్నారు. ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయనను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెస్సి ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి వెళ్లనున్నారు. మెస్సి రాకతో స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.