రాంచి : జార్ఖండ్ లోని రాంచీ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా వెనుక భాగం రన్‌వేను తాకింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఈ విమానం 70 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి రాంచీకి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇందులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సాంకేతికంగా మళ్లీ టేకాఫ్‌కు అనువుగా లేకపోవడంతో రాంచీ నుంచి భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్టు రాంచీ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు.