అమరావతి: కన్నతండ్రి కళ్ల ముందే ఆటో కింద పడి కూతురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో సుంకరమెట్ట దగ్గర జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సునీత(18) అనే యువతి టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతోంది. టెట్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్‌కు తండ్రి లక్ష్మణరావు తన ఆటోలో తీసుకెళ్తున్నాడు. సెంటర్ అడ్రస్ కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి వెళ్తున్నారు. ఎగ్జామ్ మంచిగా రాయాలి తల్లి అని కబుర్లు చెబుతూ బయటకు వెళ్తున్నారు. సుంకరమెట్ట జంక్షన్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆటోలో తండ్రి పక్కన కూర్చున్న కూతురు రోడ్డుపై పడింది. ఆమె పైనుంచి ఆటో పోవడంతో ఘటనా స్థలంలోనే కూతురు చనిపోయింది. తన కళ్ల ముందే కూతురు మృతి చెందడంతో తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కూతురు మృతదేహాన్ని ఎన్‌టిఆర్ ఆస్పత్రికి తరలించారు.