మన తెలంగాణ/ హైదరాబాద్: జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన రాధే లోయ రజత పకతం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో రాధే లోయ అసాధారణ ప్రతిభతో రజతం దక్కించుకుంది. బాలికల రోలర్ ఫ్రీస్టయిల్ ఈవెంట్3 విభాగంలో రాధే రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుది. జాతీయ స్థాయి పోటీల్లో ఆమెకు ఇది మూడో పతకం కావడం విశేషం. లోయ హైదరాబాద్‌లోని ఎకె హోమ్స్‌లో శిక్షణ తీసుకొంటోంది. ప్రముఖ టిటి క్రీడాకారిణి నైనా జైస్వాల్ తండ్రి అశ్వని కుమార్ పర్యవేక్షణలో లోయ సాధన కొనసాగుతోంది. కాగా బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన మోక్షిత్ రామ్ రెడ్డి ఓ స్వర్ణం, మరో రజతం గెలుచుకున్నాడు.