మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తరాది నుంచి శీ తల గాలులు వీస్తున్నాయని దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర దిశ నుం చి దూసుకొస్తున్న శీతల గాలులు రాష్ట్ర వాతావారణాన్ని గణనీయంగా చల్లబరుస్తున్నాయి. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3- నుం డి 5 డిగ్రీలు తగ్గడంతో రాత్రి, తెల్లవారుజామున చలికి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రెం డు,- మూడు రోజులు ఇదే స్థాయి చలి కొనసాగే అ వకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్త ర, పశ్చమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభా వం అధికంగా ఉంటుందని పేర్కొంది. రెండు రో జుల పాటు శీతల, అతిశీతల గాలులు వీచే అవకా శం ఉందని చెప్పింది. దీంతో ఉత్తర, పశ్చిమ, ఈ శాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వివరించింది. శని, ఆదివారాల్లో పొగమంచు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
శీతల గాలులతో పాటు పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8.30గంటల వరకు రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డిలో 5.8 డిగ్రీలు నమోదు కాగా, రంగారెడ్డి 6, కొమరంభీం ఆసిఫాబాద్ 6.5, వికారాబాద్ 6.8, మేడ్చల్ మల్కాజ్‌గిరి 7.1, నిజామాబాద్ 7.3, కామారెడ్డి, ఆదిలాబాద్ 7.5, సిద్దిపేట 7.6, నిర్మల్, మెదక్ 7.8, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట 8.4, పెద్దపల్లి 8.5, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల 8.6, జనగాం, ములుగు 8.9, హన్మకొండ, మంచిర్యాల 9, నాగర్ కర్నూల్ 9.3, మహబూబ్‌నగర్ 9.4, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి 9.5, వరంగల్ 9.6, భద్రాద్రి కొత్తగూడెం 9.7, మహబూబాబాద్ 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. చలి తీవ్రతకు సాధారణ జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, రాత్రిపూట బయటికి వెళ్లి పనులు చేసుకోవాలంటేనే బెంబేలెత్తుతున్నారు. చలి ప్రభావం ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపై తీవ్రంగా ఉంది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
శనివారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, మంచిర్యాల, నాగర్ కర్నూల్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.