అమరావతి: గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపింది. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు తేదీలను అధికారులు ప్రకటించారు. విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్ నోటిఫికేషన్ జారీ చేశారు.