కంటెంట్ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. అలా మంచి కంటెంట్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ కోవకు చెందిన సినిమానే లేటెస్ట్ హిట్ రాజు వెడ్స్ రాంబాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. అఖిల్ రాజ్, తేజస్వీని రావ్ జంటగా నటించిన ఈ సినిమాకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. గత నెల 21న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
డిసెంబర్ 18వ తేదీ నుంచి ఈటివి విన్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటివి విన్ పోస్టర్‌ని పంచుకుంది. అంతేకాదు, మరో సర్‌ప్రైజ్‌ని కూడా చెప్పింది. ఈ మూవీ ఎక్స్‌టెండెడ్ కట్‌ను ఒటిటిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. థియేటర్‌లో ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 15 నిమిషాలు కాగా, ఎక్స్‌టెండెట్ కట్‌లో మరికొన్ని సన్నివేశాలను జోడించి విడుదల చేయనున్నారు. మరి థియేటర్‌లో ఆడియన్స్‌ని మెప్పించిన ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ సంపాదిస్తుందో వేచి చూడాలి.