మన తెలంగాణ/హైదరాబాద్: ప్రము ఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో స్టేడి యం ఆవరణలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుం ది. మెస్సీ పాల్గొనే మ్యాచ్‌లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా ని ర్వహించాలని ఇప్పటికే తెలంగాణ బం దోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాల ని ఇప్పటికే సూచించారు. మరో వైపు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉ ప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీ జీపీ కూడా స్వయంగా పర్యవేక్షించా రు. శనివారం సాయంత్రం 4 గంటల కు మెస్సీ హైదరాబాద్ నగరానికి వస్తా రు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు.
మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) స్టేడియంలో సందడి చేస్తారని, ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్- 9 తో, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుంది. 15 మంది చిన్నారులు మ్యాచ్‌లో పాల్గొంటారు. అందులో ఐదుగురు ట్రైనింగ్ పొందిన వారు కాగా మిగతా 10 మంది ప్రతిభ ఉండి ట్రైనింగ్‌కు దూరమైన (అండర్ ప్రివిలేజ్డ్) పిల్లలు. చివరి ఐదు నిమిషాలు సీఎం రేవంత్‌రెడ్డి మ్యాచ్‌లో బరిలో దిగుతారు. అనంతరం ఫుట్‌బాల్ క్లినిక్ ఉంటుందని, ఇందులో భాగంగా యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ ఎలా నేర్చుకోవాలి? ఎలా ఆడాలి? ఏమేం చేయాలి? అనే చిట్కాలు చెబుతారు. మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. తరువాత విజేతలకు మెస్సీ బహుమతులు అందచేసిన అనంతరం జరిగే పరేడ్‌లో రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. దాదాపు గంట పాటు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఉండి రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబయికి వెళతారు.
నాలుగు సెక్టార్లుగా ఉప్పల్ స్టేడియం
‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారయ్యాయి. శనివారం రాత్రి కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే మెస్సీ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్యాలెస్ పరిసరాలను పోలీసులు పరిశీలించారు. ప్యాలెస్‌కు రాకపోకలు సాగించే మార్గాలు, అక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉండడంతో సుమారు 300 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. 1500 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎస్బీ, సీసీస్, ఎస్‌ఓటీ, ఆక్టోపస్ బలగాలను మోహరించనున్నారు.
100 మందికి ఫొటోలు తీసుకునే అవకాశం
ఈ నెల 13న సాయంత్రం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెడతారని నిర్వాహకురాలు పార్వతి రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ’మెస్సీతో మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగవచ్చని అన్నారు. ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కేవలం వంద మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతి రెడ్డి ప్రకటించారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని, క్రికెటర్లను ఈవెంట్‌కు ఆహ్వానించలేదని, స్టేడియంలో 3 గంటల పాటు ఈవెంట్ ఉంటుందని, కార్యక్రమంలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశామని పార్వతి రెడ్డి వెల్లడించారు.
మెస్సీ పెనాల్టీ స్ట్రోక్
మెస్సీ స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి జరుగుతందని పార్వతి తెలిపారు. హైదరాబాద్ కల్చర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టాలని నగరానికి చెందిన ఒక యంగ్ ర్యాపర్‌తో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు సింగర్లు ఉంటారని అన్నారు. మెస్సీ ఉద్దేశం ఫుట్‌బాల్‌ను ప్రచారం చేయడమని దాని ద్వారా పిల్లల ఆరోగ్యం, ఫిట్‌నెస్, గ్రోత్ అనేది ఉంటుందని తెలిపారు. మెస్సీ పరేడ్ చేయడంతో పాటు పెనాల్టీ స్ట్రోక్ కూడా ప్రదర్శిస్తారని తెలిపారు. చివరగా మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు గోట్ కప్‌ను మెస్సీ అందజేస్తారని, అందులో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఉంటారని పార్వతి రెడ్డి పేర్కొన్నారు.