రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులు ఉండవు కనుక అధికార పార్టీకి అనుకూలంగా ఉంటామని, నిధులు వస్తాయని పలువురిలో అభిప్రాయం ఉంటుందని , కానీ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 50 శాతం సీట్లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఎంత విముఖత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్ లెక్క మారిసోయారని, మెస్సితో ఫుట్‌బాల్ డుతున్నారని మండిపడ్డారు. సింగరేణి క్వార్టర్ బాగు చేయడానికి పైసలు లేవు.. అప్పుతెచ్చుకుంటే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ సింగరేణి డబ్బులు 100 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకు ఇచ్చి క్రికెట్ స్టేడియంను మార్చి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సిఎం ప్రాక్టీస్ చేయడానికి ఫుట్‌బాల్ కోర్టు తయారు చేసుకుని సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పలికిన ప్రగల్బాలు అబద్ధపు ప్రచార ప్రలోభాలు కాదని బిజెపి బలపరిచిన అభ్యర్థులు కమలాపూర్, శనిగరం, గుండేడు, గూడూర్ గ్రామాలను గెలిపించడమే కాకుండా తాము మద్దతు ఇచ్చిన ఐదు గ్రామాలు దేశరాజ్‌పల్లి, కానిపర్తి, గోపాల్‌పూర్, మాధన్నపేట, నేరేళ్ళలో కూడా విజయం సాధించామన్నారు. ఈ ఎన్నికలు ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న నాయకుడిని పార్టీను చూసి ఫలితాలు వస్తాయని అన్నారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుకు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి వారి ఖాతాలో వేసుకోవడం కాదని, ప్రజాభిప్రాయం గౌరవించాలని, రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బుకాదు ముఖ్యం.. క్యారెక్టర్, కమిట్మెంట్ ఉన్న వారిని, మీతో ఉండి పనిచేసే వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.